Cinema Tickets: ఆన్ లైన్లో సినిమా టికెట్ల అమ్మకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ విధానాన్ని పరిశీలిద్దామన్న హైకోర్టు!

AP High Court gives permission to state government to sell cinema tickets online
  • ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ లో టిక్కెట్లను విక్రయించవచ్చన్న హైకోర్టు
  • మల్టీప్లెక్స్ ల అభ్యర్థనలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని వ్యాఖ్య
  • తదుపరి విచారణ జూలై 12వ తేదీకి వాయిదా
బ్లాక్ టికెట్ల అమ్మకాలను నియంత్రించాలనే ఉద్దేశంతో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. విషయం హైకోర్టు వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది. 

ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్లను అమ్ముకోవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్ని రోజులు పరిశీలిద్దామని పేర్కొంది. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ సొంత వేదికలపై టికెట్లను అమ్ముకునేందుకు ప్రస్తుతానికి అనుమతిని ఇవ్వలేమని తెలిపింది. మల్టీప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థనలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది.
Cinema Tickets
Andhra Pradesh
Government
Portal
AP High Court

More Telugu News