Chandrababu: రుషికొండ రిసార్ట్స్ కు వెళ్లేందుకు చంద్రబాబు యత్నం... అడ్డుకున్న పోలీసులు

Vizag police halts Chandrababu convoy at Yendada junction while he was heading to Rushijonda resorts
  • విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన
  • హరిత రిసార్ట్స్ కు వెళ్లాలని నిర్ణయం
  • చంద్రబాబు కాన్వాయ్ ని దారిమళ్లించిన పోలీసులు
  • టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండలోని హరిత రిసార్ట్స్ నిర్మాణాలను పరిశీలించేందుకు ఆయన బయల్దేరగా, ఎండాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేశారు. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబు బృందానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

వాస్తవానికి చంద్రబాబు కాన్వాయ్ బీచ్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉండగా, పోలీసులు ఎండాడ వైపు మళ్లించి జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. 

అటు, రుషికొండ వైపు భారీగా తరలి వెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో దాదాపు 200 మంది పోలీసులు రుషికొండ వద్ద మోహరించినట్టు తెలుస్తోంది.
Chandrababu
Police
Rushikonda Resorts
Visakhapatnam
TDP

More Telugu News