జిగ్నేశ్ మేవానీకి 3 నెలల జైలు... 2017 నాటి కేసులో శిక్ష ఖరారు
- 2017లో ఆజాదీ కూచ్ పేరిట జిగ్నేశ్ ర్యాలీ
- ర్యాలీపై నాడే కేసులు నమోదు చేసిన పోలీసులు
- జిగ్నేశ్కు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధింపు
ఆజాదీ కూచ్ పేరిట 2017లో తన అనుచరులతో కలిసి జిగ్నేశ్ ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుజరాత్లోని మెహసానా నుంచి బనస్కంత జిల్లాలోని ధనేరా వరకు సాగింది. ఈ ఘటనపై అప్పుడే పోలీసులు కేసులు నమోదు చేయగా... తాజాగా ఈ కేసులో జిగ్నేశ్కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు విచారణను ముగించింది.