Duggirala: దుగ్గిరాల మండల పరిషత్ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ నేత ఎన్నిక‌

tdp leader elected as duggirala mandal parishad co option member
  • కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ నేత‌ వహిదుల్లా 
  • వ‌హిదుల్లాకు అనుకూలంగా 10 ఓట్లు
  • ఓటింగ్‌కు దూరంగా ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు
గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షుడి ఎన్నిక‌లో భాగంగా కాసేప‌టి క్రితం ముగిసిన కో ఆప్ష‌న్ స‌భ్యుడి ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీకి షాక్ త‌గిలింది. దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ ప్ర‌తిపాదించిన వ‌హిదుల్లా ఎన్నిక‌య్యారు. కాసేప‌టి క్రితం ఓటింగ్ జ‌ర‌గ‌గా.. వ‌హిదుల్లాకు 10 ఓట్లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా ఎన్నికైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ ప్ర‌తిపాదించిన వ‌హిదుల్లా ఎన్నిక‌పై ఓటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు స‌మావేశం నుంచి బయ‌ట‌కు వెళ్లిపోయారు. ఈ ఐదుగురు ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకే వీరు స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.  
Duggirala
MPP
Mangalagiri
TDP
YSRCP

More Telugu News