Revanth Reddy: పోలీసులు లేకుండా నువ్వు, నీ మామ తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది?: హరీశ్ రావుకు రేవంత్ ప్రశ్న

Harish why you and your uncle are not coming outside without police asks Revanth Reddy
  • రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
  • తెలంగాణకు ఆయన ఎందుకొస్తున్నారన్న హరీశ్
  • రాహుల్ ని విమర్శించే స్థాయి నీకు లేదన్న రేవంత్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై హరీశ్ రావు సెటైర్లు వేశారు. తెలంగాణకు ఆయన ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రైతులు కష్టాలను అనుభవించారని అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ... పోలీసుల పహారా లేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చిందని హరీశ్ ను ప్రశ్నించారు. నీ పర్యటన సమయంలో పోలీసులు పొలాలకు వెళ్లి రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవ కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావని అన్నారు. రాహుల్ ని విమర్శించే స్థాయి, అర్హత నీకు లేవని మండిపడ్డారు.
Revanth Reddy
Rahul Gandhi
Congress
Harish Rao
KCR
TRS

More Telugu News