రాహుల్ గాంధీ, జేపీ నడ్డాల పర్యటనలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
- తెలంగాణలో పర్యటించనున్న రాహుల్, జేపీ నడ్డా
- తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారన్న కవిత
- రాష్ట్రానికి వీరు చేసిందేమీ లేదని వ్యాఖ్య
తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారంటూ కవిత ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రానికి వస్తుంటారని.. రాష్ట్రానికి వీరు చేసిందేమీ ఉండదని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ కేవలం రాజకీయాల కోసమేనని విమర్శించారు. రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కవిత మండిపడ్డారు.