Karan Johar: ‘భారమైన హృదయంతో చెబుతున్నా’.. అంటూ మళ్లీ ఆ షో చేయబోనన్న కరణ్ జొహార్

  • బాలీవుడ్ లో ‘కాఫీ విత్ కరణ్’ హిట్ షో
  • ఆరో సీజన్ త్వరలోనే షురూ అని సంస్థ ప్రకటన
  • ఇన్ స్టాగ్రామ్ లో స్పష్టతనిచ్చిన కరణ్ 
With Heavy Heart Wont Make That Show Again Says Karan Johar

కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది ఆ షో. సెలబ్రిటీలను స్టూడియోకు పిలిచి సరదా, షాకింగ్ ప్రశ్నలు వేస్తూ సరదా సరదాగా సాగిపోయే ఆ షో ఇకపై ఉండే చాన్స్ లేదు. ఇకపై ఆ షో చేయబోనని బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్ ప్రకటించారు. 

‘కాఫీ విత్ కరణ్’ తాజా సీజన్ త్వరలోనే ప్రసారం కాబోతోందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే, ఆ వార్తలను ఖండిస్తూ కరణ్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆ షోపై స్పష్టంగా చెప్పారు. ‘‘భారమైన హృదయంతో చెబుతున్నా.. ఇకపై ఆ షో ఉండబోదు’’ అని ప్రకటించారు. 

‘‘కాఫీ విత్ కరణ్ నా జీవితం, మీ జీవితం.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఇప్పటిదాకా 6 సీజన్లను నడిపించాం. టెలివిజన్ రంగంలో మేము ఓ ముద్ర వేశాం. ప్రభావితం చేశాం. పాప్ సంస్కృతిలో మాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాం. అయితే, భారమైన హృదయంతో అందరికీ ఓ విషయం చెప్పదలచుకున్నా. కాఫీ విత్ కరణ్ మళ్లీ చేయట్లేదు’’  అని ఆయన పోస్ట్ పెట్టారు. 

ఈ ప్రకటనతో అభిమానులు షాక్ తిన్నారు. తమ అభిమాన స్టార్ల అభిమతం, అభిరుచులను తెలుసుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అంతకుముందు కాఫీ విత్ కరణ్ తాజా సీజన్ త్వరలోనే అందరి ముందుకు వస్తుందని ఆ షోను ప్రసారం చేసే సంస్థ ప్రకటించింది. మే నుంచి షూటింగ్ లో కరణ్ పాల్గొంటారని పేర్కొంది. ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైందని చెప్పింది.

More Telugu News