Chiranjeevi: దాస‌రిని గుర్తు చేసుకున్న చిరు

  • నేడు దాస‌రి జ‌యంతి
  • దాస‌రి గొప్ప‌త‌నాన్ని ట్వీట్ చేసిన చిరు
  • దాస‌రితో తాను క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం
టాలీవుడ్ దివంగ‌త ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావును మెగాస్టార్ చిరంజీవి మంగ‌ళ‌వారం స్మ‌రించుకున్నారు. దాస‌రి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరు ట్విట్ట‌ర్ వేదిక‌గా దాస‌రితో తాను క‌లిసి ఉన్న ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా దాస‌రి గొప్ప‌త‌నాన్ని చెబుతూ చిరంజీవి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి  ఆపద్బంధువు, నాకు మార్గదర్శి, ఆప్తులు... ఫ‌రెవ‌ర్ లివింగ్ ఇన్ అవ‌ర్ హార్ట్స్‌(forever living in our hearts)  దాసరి గారిని జన్మదినోత్సవం నాడు స్మరించుకుంటూ" అంటూ స‌ద‌రు ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు.
Chiranjeevi
Mega Star
Tollywood
Dasari Narayana Rao

More Telugu News