Andhra Pradesh: ఏపీలో పరీక్ష రాస్తున్న టెన్త్ విద్యార్థినిపై కూలిన ఫ్యాన్.. ముఖానికి గాయం

Fan Crashes On Student Writing Tenth Exam
  • నిన్న సత్యసాయి జిల్లాలో జరిగిన వైనం
  • చికిత్స అనంతరం పరీక్ష రాసిన విద్యార్థిని
  • ఈ ఘటన దురదృష్టకరమన్న స్కూలు ప్రిన్సిపాల్
పరీక్షలు రాస్తుండగా తిరుగుతున్న ఫ్యాన్ ఉన్నట్టుండి ఊడి ఓ పదో తరగతి విద్యార్థిని మీద పడింది. సత్యసాయి జిల్లాలోని ఓ టెన్త్ పరీక్షా కేంద్రంలో నిన్న జరిగిన ఈ ఘటనలో విద్యార్థిని మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది. 

పరీక్షకు రెండు రోజుల ముందు మెయింటెనెన్స్ చేయించామని స్కూలు ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని, పటిష్ఠ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అంతకుముందు గత నెల 28న కర్నూలు జిల్లా గోనెగండ్లలోని మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ పైకప్పు కూలి ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Tenth Exams
Student

More Telugu News