Venkatesh Daggubati: ' ఎఫ్ 3' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

F3 movie update
  • 'ఎఫ్ 2'ను మించిన కామెడీతో  'ఎఫ్ 3'
  • ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానున్న ట్రైలర్ 
  • పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 27వ తేదీన సినిమా విడుదల
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల వదిలిన 'ఊ ఆ  అహ అహ' అనే పాట బాగా పాప్యులర్ అయింది. ఫస్టు పార్టుకి మించిన కామెడీ సెకండ్ పార్టులో ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు.

 తమన్నా  .. మెహ్రీన్ అందాలు ఒలకబోసిన తీరు, సోనాల్ చౌహన్ గ్లామర్ తళుకులు .. పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ చూస్తే, రొమాన్స్ విషయంలో కూడా సెకండ్ పార్టు తక్కువేం తినలేదనే విషయం తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్  .. మురళీశర్మ .. సంగీత .. అంజలి .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi

More Telugu News