Revanth Reddy: కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయండి: రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy calls for KCR epigies burning
  • నిన్న హైదరాబాదులో యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • అరెస్టులకు నిరసనగా రేవంత్ పిలుపు
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. రాహుల్ సభతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చేందుకు టీపీసీసీ యత్నిస్తోంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిన్న హైదరాబాదులో విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దగ్ధ చేయాలని రేవంత్ తెలిపారు. కేసీఆర్ పాశవిక చర్యలను ఖండిస్తూ విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ సభకు ఎందుకు అనుమతించలేదంటూ ఆందోళన చేపట్టిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్థం కార్యక్రమానికి రేవంత్ పిలుపునిచ్చారు.
Revanth Reddy
Congress
Rahul Gandhi
KCR
Epigy

More Telugu News