ఒక్కంగుళం భూభాగాన్ని కూడా చైనాకు వదిలేది లేదు: భారత ఆర్మీ నూతన చీఫ్ మనోజ్ పాండే
- భారత కొత్త సైన్యాధిపతిగా మనోజ్ పాండే
- సైన్యం వైఖరిని స్పష్టం చేసిన లెఫ్టినెంట్ జనరల్
- సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి
- ఎలాంటి దురాక్రమణను అంగీకరించబోమని స్పష్టీకరణ
తమ సన్నద్ధత గురించి చెబుతూ, చైనాతో సరిహద్దుల్లో అదనపు వ్యవస్థలు, బలగాలను మోహరించామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు.
ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నది సంప్రదాయ యుద్ధమేనని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.