EV fire: ప్రతీ ఎలక్ట్రిక్ వాహన ప్రమాదంపై లోతైన దర్యాప్తు: కేంద్రం

  • తయారీదారులు తగిన ప్రమాణాలు పాటించాలి
  • భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి
  • కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్
EV fire incidents will be probed  Transport Secy

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో (ఈవీలు) అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా.. ప్రతి ప్రమాదం విషయమై లోతైన దర్యాప్తు చేయిస్తామని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ ఇంకా నివేదిక సమర్పించలేదని చెప్పారు. భారత ఈవీ పరిశ్రమ ఎంతో వృద్ధిని చూస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ఊహలకూ కూడా అందననంతగా ఇది ఉంటుందన్నారు. 


ఈవీ బ్యాటరీల్లో అగ్ని ప్రమాదాలు ఈ రంగంలో భారత్ విజేతగా నిలవడానికి అడ్డంకి అవుతుందా? అన్న ప్రశ్నకు.. తయారీదారులు తప్పనిసరి భద్రతా చర్యలు, నాణ్యత నియంత్రణ, ప్రమాణాలు, భరోసానిచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ‘‘కొనుగోళ్లు, డిజైన్, నిర్వహణ, కార్యకలాపాలు, బ్యాటరీల తయారీని పరీక్షించాల్సి ఉంటుంది’’అని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత.. నిర్లక్ష్యం చూపించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇటీవలే స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవీ ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం, ప్రాణ ప్రమాదం ఏర్పడడం తెలిసిందే.

More Telugu News