KTR: 28 ఏళ్ల తర్వాత 'విజ్ఞాన్' క్లాస్ మేట్స్ ను కలిసిన కేటీఆర్... ఫొటో ఇదిగో!

KTR met his old friends studied in Vignan Vadlamudi Campus
  • ఉమ్మడి ఏపీలో ఇంటర్ చదివిన కేటీఆర్
  • విజ్ఞాన్ వడ్లమూడి క్యాంపస్ లో 91-93 బ్యాచ్ లో విద్యాభ్యాసం
  • కాలం ఎంతో వేగంగా గడచిపోయిందన్న కేటీఆర్
  • ట్విట్టర్ లో వెల్లడి 
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఏపీ సమయంలో ఇంటర్మీడియట్ విద్యను విజ్ఞాన్ సంస్థల్లో పూర్తి చేశారు. ఆనాడు తనతో కలిసి విజ్ఞాన్ లో చదివిన క్లాస్ మేట్స్ ను కేటీఆర్ మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. దీనిపై ట్వీట్ చేశారు. 

"పాత మిత్రులను కలుసుకోవడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. విజ్ఞాన్ లో నాతో పాటు చదివిన 91-93 బ్యాచ్ మేట్స్ తో సమావేశం ఎంతో సంతోషం కలిగించింది. వాళ్లలో చాలామంది డాక్టర్లే ఉన్నారు. 28 ఏళ్ల తర్వాత కలిశాం... కాలం ఎంత వేగంగా గడచిపోయిందో అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు మళ్లీ కలిసిన తర్వాత, కొన్నివారాల కిందటే విజ్ఞాన్ వడ్లమూడి క్యాంపస్ లో కలిసి చదువుకున్నట్టే అనిపిస్తోంది" అంటూ కేటీఆర్ తన మనోభావాలను పంచుకున్నారు. తన మిత్రులతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.
.
KTR
Vignan
Old Friends
Vadlamudi Campus

More Telugu News