Talari Venkata Rao: కొత్త వ్యక్తులతో కలిసి టీడీపీ నేతలే నాపై దాడికి పాల్పడ్డారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

YCP MLA Talari Venkata Rao alleges TDP leaders attacked him
  • ఏలూరు జిల్లాలో ఘటన
  • హత్యకు గురైన జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు
  • గ్రామానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై దాడి
  • కాపాడిన పోలీసులు 
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య నేపథ్యంలో, జి.కొత్తపల్లి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఆయనను పోలీసులు అక్కడ్నించి తరలించాల్సి వచ్చింది. తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని మృతుడు గంజి ప్రసాద్ భార్య ఆరోపిస్తోంది. ఈ ఘటనపై గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. 

వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ ను హత్య చేశారని తెలియడంతో అక్కడికి వెళ్లానని వెల్లడించారు. అయితే, కొత్త వ్యక్తులతో కలిసి టీడీపీ నేతలు తనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్పీ, ఇతర పోలీసులు తనను స్కూలు బిల్డింగ్ లోకి తీసుకువెళ్లారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులకు పాల్పడ్డారో పోలీసులు తేల్చాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కోరారు.
Talari Venkata Rao
Attack
TDP Leaders
Eluru District
YSRCP

More Telugu News