కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఏపీ సీఎం జగన్ సమావేశం
- ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన
- మన్సుఖ్ మాండవీయతో అరగంట సేపు భేటీ
- ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని మంత్రికి వెల్లడి
- 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి
ఇటీవల తాము 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం జగన్... ఆయా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. మన్సుఖ్ మాండవీయతో సీఎం జగన్ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది.