Realme Buds: రియల్ మీ నూతన ఆవిష్కరణలు.. 23వేలకే 40 అంగుళాల స్మార్ట్ టీవీ

Realme Buds Q2s Realme Smart TV X Full HD launched in India
  • క్యూ2ఎస్ పేరుతో ఇయర్ బడ్స్
  • ధర రూ.1,999
  • మే 2 నుంచి విక్రయాలు
  • రూ.22,999 - 25,999 మధ్య రెండు టీవీలు
రియల్ మీ స్మార్ట్ టీవీలు, ఇయర్ బడ్స్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రియల్ మీ బడ్స్ క్యూ2ఎస్ పేరుతో ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. దీని ధర రూ.1,999. మే 2 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్ కు వెళ్లి ఆ సమయంలో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆఫ్ లైన్ స్టోర్లలోను ఇవి అందుబాటులో ఉంటాయి. చార్జింగ్ కేసు పై మూత లోపలి బడ్స్ కనిపించేదిగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 30 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదు.

రియల్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఫుల్ హెచ్ డీ రెండు రకాల సైజుల్లో లభిస్తుంది. 40 అంగుళాల స్క్రీన్ సైజు ధర రూ.22,999. 40 అంగుళాల స్క్రీన్ తో కూడిన టీవీ ధర రూ.25,999. 40 అంగుళాల టీవీ మొదటి విడత విక్రయాలు మే 4న ప్రారంభమవుతాయి. మే 5 నుంచి 43 అంగుళాల టీవీ అమ్మకాలు మొదలవుతాయి. 8.7 ఎంఎంతో స్లీక్ గా, చివర్లో బెజెల్స్ కనిపించకుండా టీవీ ఉంటుంది. ఏడు రకాల డిస్ ప్లే మోడ్ లు.. స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్, యూజర్ మోడ్ లలో నచ్చింది పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11పై పని చేస్తోంది. టీవీ ప్యానెల్స్ పై రెండేళ్ల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Realme Buds
Realme Smart TV
launched

More Telugu News