MPP: ఏపీలో ఎంపీపీ ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ

  • 4 మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్షుల ఎన్నిక‌
  • రాయ‌వ‌రం మండ‌ల ప‌రిష‌త్‌కు ఉపాధ్య‌క్షుడి ఎన్నిక‌
  • 26 గ్రామ పంచాయ‌తీల్లో ఉప సర్పంచ్‌ల ఎన్నిక‌
  • మే 5న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌
  • నోటిఫికేష‌న్ జారీ చేసిన ఎస్ఈసీ నీలం సాహ్నీ
ap sec releases notification to mpp and grampanchayat by elections

ఏపీలో స్థానిక సంస్థ‌ల్లో ఖాళీగా ఉన్న ప‌ద‌వుల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. ఈ మేర‌కు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని శుక్ర‌వారం విడుద‌ల చేశారు. 5 మండ‌ల ప‌రిష‌త్‌ల‌తో పాటు 26 పంచాయ‌తీల్లో ఉప స‌ర్పంచ్‌ల ఎన్నిక‌కు కూడా నీలం సాహ్ని నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఆయా మండ‌ల ప‌రిష‌త్‌, గ్రామ పంచాయ‌తీల్లో వ‌చ్చే నెల 5న ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

శుక్ర‌వారం విడుద‌లైన నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఏపీలోని ప‌లు జిల్లాల‌కు చెందిన న‌ర‌సాపురం, ఉంగుటూరు, పెద‌కూర‌పాడు, పొద‌ల‌కూరు మండ‌ల ప‌రిష‌త్‌లకు సంబంధించి మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షుల‌తో పాటు మండ‌ల ప‌రిష‌త్ ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కోన‌సీమ జిల్లాకు చెందిన రాయ‌వ‌రం మండ‌ల ప‌రిష‌త్‌కు సంబంధించి ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి కూడా ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అదే మాదిరిగా 26 పంచాయ‌తీల్లో ఉప స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా మే 5నే జ‌ర‌గ‌నున్నాయి.

More Telugu News