Police: కుమారుడికి బెయిల్ కోసం వచ్చిన మహిళతో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి!

Police officer gets a massage by a woman
  • బీహార్ లో ఘటన
  • ఓ కేసులో జైలుపాలైన మహిళ తనయుడు
  • తాను బెయిల్ ఇప్పిస్తానన్న పోలీసు అధికారి
  • మసాజ్ వీడియో వైరల్
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 
పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీహార్ లోనూ ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. ఓ కేసులో జైలు పాలైన కుమారుడికి బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో పోలీసు అధికారి మసాజ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

బీహార్ లోని సహర్సా ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో శశిభూషణ్ సిన్హా ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన విధుల్లో ఉన్న సమయంలో సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కుమారుడి పరిస్థితిని ఇన్ స్పెక్టర్ శశిభూషణ్ సిన్హాకు వివరించింది. దాంతో ఆయన... నాకు మసాజ్ చేయి... నీ కొడుక్కి బెయిల్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఆపై, వంటిపై చొక్కా కూడా లేని స్థితిలో ఆ మహిళతో మసాజ్ చేయించుకున్నాడు. 

ఓవైపు ఫోన్ లో మాట్లాడుతూ ఆ ఇన్ స్పెక్టర్ తన అధికార దర్పం ప్రదర్శించగా, అవసరం కొద్దీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆ మహిళ అతడికి మసాజ్ చేసింది. అయితే, స్టేషన్ లో ఉన్న ఇతరులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు.
Police
Woman
Bail
Massage
Bihar

More Telugu News