Nara Lokesh: వైసీపీ అండతో చెలరేగిపోతున్న నేరగాళ్లకు ఈ తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్

Nara Lokesh response on death sentence to Ramya murder case convict
  • రమ్యను హత్య చేసిన శశికృష్ణకు ఉరిశిక్ష విధించిన కోర్టు
  • కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న నారా లోకేశ్
  • జగన్ పాలనలో 800 మంది మహిళలపై దారుణాలు జరిగాయని వ్యాఖ్య
గుంటురులో బీటెక్ విద్యార్థిని రమ్యను దారుణంగా కత్తితో పొడిచి హత్యచేసిన శశికృష్ణకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. గుంటూరులోని ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు. హత్య జరిగిన సంవత్సరం లోపలే కోర్టు త్వరితగతిన విచారణను పూర్తి చేసి, తుది తీర్పును వెలువరించడం గమనార్హం. మరోవైపు దోషికి ఉరిశిక్ష పడటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ రమ్య హంతకుడికి ఉరిశిక్షను విధించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వైసీపీ అండతో చట్టాన్ని చుట్టం చేసుకుని చెలరేగిపోతున్న నేరగాళ్లకు కోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. జగన్ పాలనలో ఇప్పటి వరకు 800 మంది మహిళలపై దారుణాలు జరిగాయని చెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Ramya
Murder
Jagan

More Telugu News