New Delhi: ఐడియా.. పోలా..అదిరిపోలా!.. పెళ్లి బరాత్ లో ఎండకు సూపర్ పరిష్కారం.. ఈ వీడియో చూస్తే మీకూ తెలుస్తుంది!

A Family Makes Great Idea To Beat Heat Wave in Wedding Baraat
  • బయట బాగా ఎక్కువగా ఎండ వేడి
  • పెళ్లి బరాత్ కోసం చలువ పందిరి తయార్
  • ఢిల్లీ ఫ్యామిలీ వినూత్న ఆలోచన

అబ్బబ్బా.. బయటకెళ్తే చాలు భానుడు భగభగలాడి పోతున్నాడు. సూరీడి వేడి చురకలు ఒంటిని తాకేస్తున్నాయి. దాని నుంచి ఉపశమనం పొందేందుకు ప్లేటు పుచ్చకాయ ముక్కలో.. ఓ గ్లాసు నిమ్మరసమో.. చల్లని చెట్టు నీడను వెతికేసుకుంటున్నాం. నిన్న కొన్ని చోట్ల వర్షం పడి వాతావరణం కొంచెం చల్లబడినా.. చాలా చోట్ల మాత్రం సురసురలు తప్పలేదు. 

ఇలాంటి ఎండల్లో పెళ్లి ఊరేగింపు పెట్టుకుంటే..! వామ్మో అనుకుంటున్నారా? కానీ, ఢిల్లీలో ఓ పెళ్లింటి వారు భలే ఐడియా వేశారు. పెళ్లి బరాత్ కు ఒక పెద్ద చలువ పందిరిని సృష్టించారండోయ్. దాని కిందే ఏంచక్కా వధూవరులను ఊరేగించేశారు. అంతేకాదండోయ్.. డప్పులు, డీజే చప్పుళ్లకు బంధువులు కాలు కదిపి స్టెప్పులూ వేశారు. మొత్తంగా పెళ్లి బరాత్ ను ఎండలోనూ చల్లగా ఎంజాయ్ చేసేశారు. 

దేవయాని కోహ్లీ అనే మహిళ ట్విట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ‘‘అందుకే భారత్ ను ఆవిష్కరణలకు అడ్డా అని అనేది. పెళ్లి బరాత్ కు ఎండ వేడి నుంచి ఉపశమనం, పరిష్కారాన్ని ఇదిగో ఇలా కనుగొన్నారు. ఐడియా సూపర్ కదా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఏదేమైనా ‘‘ఐడియా.. పోలా.. అదిరిపోలా!’’.. మరి, మీరేమంటారు!

  • Loading...

More Telugu News