Samantha: మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా: సమంత పోస్ట్

Samantha Emotional Post On Her Birth Day Wishes
  • పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి థ్యాంక్స్
  • ప్రోత్సాహం, స్ఫూర్తికి ఎప్పటికీ కృతజ్ఞురాలినేనని కామెంట్
  • ఎంతో ఉత్సాహాన్ని నింపారంటూ కామెంట్
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. నిన్న సామ్ 35వ పుట్టినరోజును జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలు, హీరోయిన్లు, ఆమె స్నేహితులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. 

దీంతో ఆమె వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ‘‘నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు’’ అని సమంత పేర్కొంది. అంతేకాదు.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారు పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లను ఆమె పోస్ట్ చేసింది.
Samantha
Tollywood
Bollywood

More Telugu News