Narendra Modi: కేటీఆర్ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్

KTR allegations rejects by union minister jitendra singh
  • మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ పీఎంవో నుంచి సమాచారం అందిందన్న కేటీఆర్
  • అలాంటి సమాచారమేదీ పంపలేదన్న కేంద్రమంత్రి
  •  కేసీఆర్ పాల్గొనడం లేదంటూ సీఎంవోనే సమాచారం ఇచ్చిందని వివరణ

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చినట్టు మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేస్తూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం అలాంటి సందేశం ఏదీ పంపలేదన్నారు. నిజానికి మోదీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారనే అనుకున్నామని, అయితే, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాజరు కాలేకపోతున్నట్టు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించిందని జితేంద్రసింగ్ తెలిపారు. 

కాగా, ఇదే విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. అనారోగ్యం కారణంగానే మోదీ పర్యటనకు తాను అందుబాటులో ఉండడం లేదని అప్పట్లో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారని అన్నారు.

  • Loading...

More Telugu News