ఈ ఐదు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు మండిపోతాయట!
- దేశంలో కొనసాగుతున్న వేసవి తీవ్రత
- మరో 2 డిగ్రీల వరకు వేడిమి పెరుగుతుందన్న ఐఎండీ
- 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి
ముఖ్యంగా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. మే తొలి వారం వరకు తీవ్ర వేడిమి పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాతే ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్కే జనమణి వెల్లడించారు.