'సర్కారువారి పాట' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- పాటలతో ఆకట్టుకుంటోన్న 'సర్కారువారి పాట'
- మే 2వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన
- తొలిసారిగా మహేశ్ తో జతకట్టిన కీర్తి సురేశ్
- మే 12వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. మే 2వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మహేశ్ జోడీగా ఆమెకి ఇదే మొదటి సినిమా.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన 'కళావతి' .. 'పెన్నీ' పాటల తో పాటు, టైటిల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.