Arvind Kejriwal: మ్యానర్ లెస్ సీఎం అంటూ కేజ్రీవాల్ పై ట్రోలింగ్!

Netizens trolling Kejriwal as mannerless CM
  • నిన్న సీఎంలతో వర్చువల్ గా భేటీ అయిన మోదీ
  • చాలా నిర్లక్ష్యంగా కూర్చున్నట్టు కనిపించిన కేజ్రీవాల్
  • పీఎం ముందు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజెన్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యానర్ లెస్ సీఎం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, కరోనా పరిస్థితులపై నిన్న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు సీఎంలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ మాట్లాడుతుండగా కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు విమర్శలపాలు అవుతోంది. మోదీ మాటలను పట్టించుకోని విధంగా చేతులను వెనక్కి పెట్టుకుని కూర్చోవడాన్ని నెటిజెన్లు తప్పుపడుతున్నారు. ప్రధానమంత్రి ముందు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా? అని నిలదీస్తున్నారు.
Arvind Kejriwal
AAP
Narendra Modi
BJP

More Telugu News