Varla Ramaiah: ఇలాగైతే పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుంది: ఏపీ డీజీపీకి వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah writes letter to AP DGP
  • మట్టి మాఫియాను అడ్డుకున్న ఆర్ఐపై కేసు పెట్టారన్న రామయ్య 
  • మాఫియా వ్యక్తులను అరెస్ట్ చేయకుండా బాధితుడిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్న 
  • కొందరు పోలీసుల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్య 
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గుడవాడలో మట్టి మాఫియాను అడ్డుకున్న ఆర్ఐపై ఎదురు కేసు పెట్టారంటూ లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న మాఫియాను అరెస్ట్ చేయకుండా బాధితుడైన ఆర్ఐని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఇదొక దుర్మార్గమైన చర్య అని చెప్పారు.  

బాధితులపైనే కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతుందని అన్నారు. పోలీసుల్లో కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని.... వీరివల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. క్రిమినల్స్ ని కాపాడేలా కొందరు పని చేస్తున్నారని అన్నారు. ఆర్ఐపై కేసు పెట్టినా రెవెన్యూ అధికారుల సంఘం, గనుల శాఖ అధికారులు మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు. 
Varla Ramaiah
Telugudesam
Andhra Pradesh
DGP

More Telugu News