Nikhil: గీతా ఆర్ట్స్ లో 'కార్తికేయ' దర్శకుడి భారీ చిత్రం!

Karthikeya 2 movie update
షార్ట్స్‌లో చూడండి
'కార్తికేయ' సినిమాతో దర్శకుడిగా చందూ మొండేటి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' సినిమాను ఆయన పూర్తిచేశాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ ను గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

"ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే .. అయితే అది నేను కావాలని తీసుకోలేదు. 'సవ్యసాచి' రిజల్ట్ విషయంలో అసంతృప్తి ఉంది. తప్పకుండా చైతూకు ఒక హిట్ ఇస్తాను. 'కార్తికేయ 2' తరువాత గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వస్తుంది. 

ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా .. ఆర్టిస్టుల ఎంపిక కూడా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదలవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలు కావలసింది. కానీ ' కార్తికేయ 2' వలన లేట్ అవుతూ వచ్చింది. త్వరలోనే సెట్స్  పైకి వెళతాము" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Nikhil
Chandu Mondeti
Katyjikeya 2 Movie

More Telugu News