KTR: మీరు ఆ పని చేస్తే లీటర్ పెట్రోల్ రూ.70కే వస్తుంది: మోదీకి కేటీఆర్ కౌంటర్

If you do this petrol rate will come down to Rs 70 says KTR in reply to Modi
  • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణమన్న మోదీ
  • రాష్ట్రాల పేర్లను ప్రస్తావిస్తూ ఎలా మాట్లాడతారన్న కేటీఆర్
  • సెస్ రద్దు చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని సూచన
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్రాలే కారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గిస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదని ఆయన విమర్శించారు.

ఈ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పేరును ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్పీఏ ప్రభుత్వం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. తాము వ్యాట్ ను పెంచకపోయినప్పటికీ రాష్ట్రం పేరును లేవనెత్తడమే మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు. 

2014 నుంచి తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచలేదని చెప్పారు. మీరు వసూలు చేస్తున్న సెస్ లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన 41 శాతం వాటా రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. సెస్ పేరుతో మీరు రాష్ట్రం నుంచి 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారని అన్నారు. సెస్ ను రద్దు చేస్తే దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 70కి, డీజిల్ ధర రూ. 60కి వస్తుందని చెప్పారు.
KTR
TRS
Narendra Modi
BJP
Petrol
Diesel

More Telugu News