Prime Minister: కోవిడ్ సంక్షోభం ముగియ‌లేదు... సీఎంల‌కు మోదీ కీల‌క ఆదేశాలు

pm modi keyguideline to chief ministers
  • కోవిడ్ సంక్షోభం ఇంకా ముగియ‌లేదన్న ప్రధాని 
  • చిన్నారుల‌ వ్యాక్సినేష‌న్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ 
  • స్కూళ్ల‌లో ప్ర‌త్యేక వ్యాక్సిన్ క్యాంపులు పెట్టాలని సూచన 
దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా విస్తృతిని అరిక‌ట్టే దిశ‌గా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వ‌ర్చువ‌ల్‌గా భేటీ అయ్యారు. బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ స‌మావేశంలో రాష్ట్రాల సీఎంల‌కు మోదీ ప‌లు కీల‌క సూచ‌న‌లు జారీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. "దేశంలో కోవిడ్ సంక్షోభం ఇంకా ముగియ‌లేదు. చిన్నారుల‌కు కోవిడ్ టీకా అందించ‌డ‌మే ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. ఇందుకోసం పాఠ‌శాల‌ల్లో ప్ర‌త్యేక వ్యాక్సిన్ క్యాంపులు పెట్టాలి. పిల్ల‌లంద‌రికీ వేగంగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలి" అని మోదీ సూచించారు.
Prime Minister
Narendra Modi
Corona Virus
Vaccination

More Telugu News