Donald Trump: మస్క్ మంచోడు.. అయినా ట్విట్టర్ కు నేను దూరం: ట్రంప్

Donald Trump says Elon Musk is a good man but he is staying away from Twitter
  • ట్విట్టర్ ను మస్క్ మరింత మెరుగ్గా తయారు చేస్తాడన్న ట్రంప్  
  • తాను మాత్రం నిజాలనే చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్య 
  • అందుకే ట్విట్టర్ లోకి వెళ్లనని స్పష్టీకరణ 
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మళ్లీ ట్విట్టర్ లో చూడొచ్చన్న వారి ఆశలపై ఆయనే నీళ్లు చల్లారు. గతేడాది నుంచి ట్రంప్ పై ట్విట్టర్ ఏకపక్ష నిషేధాన్ని అమలు చేస్తోంది. దీంతో ట్రంప్ బాగా హర్ట్ అయినట్టున్నారు. తాను మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. 

మరోపక్క, ఎలాన్ మస్క్ మంచి వ్యక్తి అంటూ ట్రంప్ కొనియాడారు. ట్విట్టర్ ను మరింత మెరుగ్గా తయారు చేస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘నేను ట్విట్టర్ లోకి వెళ్లడం లేదు. నిజాలకే కట్టుబడాలని అనుకుంటున్నాను. ఎలాన్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఎందుకంటే దాన్ని ఆయన మెరుగ్గా తయారు చేయగలడు. ఆయన మంచివాడు. కానీ, నేను నిజాలనే చెప్పాలనుకుంటున్నాను. అందుకే ట్విట్టర్ లోకి వెళ్లాలని అనుకోవడం లేదు’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. 

ట్రంప్ ఒక్క ట్విట్టర్ లోనే అని కాకుండా ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ తదితర ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. 2021 జనవరి 6న రాజధానిలో అల్లర్లు చోటు చేసుకున్న తర్వాత సామాజిక మాధ్యమాల వేదికలన్నీ ట్రంప్ పై నిషేధం ప్రకటించాయి.
Donald Trump
Twitter
Elon Musk

More Telugu News