Revanth Reddy: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి: రేవంత్ రెడ్డి

revant reddy slams  kcr
  • అమర వీరులు, ఉద్యమకారుల త్యాగాలతో తెలంగాణ‌ ఆవిర్భవించింద‌న్న రేవంత్ రెడ్డి
  • ఇప్పుడు రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని విమ‌ర్శ‌
  • కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉందని వ్యాఖ్య‌
సిటీలో ఏడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లే కనిపిస్తున్నాయంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను పోస్ట్ చేశారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయమైందని అందులో పేర్కొన్నారు. ప్లీనరీ కోసం కొన్నిచోట్ల ట్రాఫిక్ సిగ్న‌ల్స్ కు అడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని చెప్పారు.  

''చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి. అమర వీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది'' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Revanth Reddy
Congress
TRS

More Telugu News