Faf du Plessis: టాస్ కోసం రెండు సార్లు కాయిన్ ను ఎగరేసిన ఫాప్ డూప్లెసిస్

  • చెప్పక ముందే ఒకసారి స్పిన్
  • ఆగాలని కోరడంతో చేత్తో కాయిన్ పట్టుకున్న డూప్లెసిస్
  • మళ్లీ స్పిన్ చేయగా.. అతడిదే గెలుపు
Faf du Plessis asked to spin the coin twice at toss vs RR as RCB captain interrupts broadcaster introduction

టాస్ రెండోసారి వేయడం గురించి ఎప్పుడైనా విన్నామా..? తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ ఇదే పనిచేశాడు. ఐపీఎల్ సీజన్ 2022లో 39వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగింది. 

ఈ ఏడాది ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ప్రతినిథి నిక్ నైట్ రెండు జట్ల కెప్టెన్లు సంజు శామ్సన్, ఫాప్ డూప్లెసిస్ ను పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఈ లోపే (చెప్పక ముందే) డూప్లెసిస్ అనుకోకుండా కాయిన్ ను తిప్పి గాల్లోకి ఎగరేశాడు. అది చూసిన నిక్ నైట్ కొద్దిగ ఆగాలంటూ కోరాడు. దీంతో డూప్లెసిస్ ఎగరేసిన కాయిన్  కింద పడకుండా చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ తిప్పుతూ ఎగరేశాడు. ఆశ్చర్యకరంగా టాస్ డూప్లెసిస్ నే వరించింది.

More Telugu News