Ravi Shastri: ఐపీఎల్ టైటిల్ ఎవరిది? రవిశాస్త్రి ఓటు ఎవరికి?

Shastri names team that has emerged as contenders for IPL crown
  • పోటీలోకి రాజస్థాన్ రాయల్స్ వచ్చిందన్న రవిశాస్త్రి 
  • వార్న్ కోసం వాళ్లు కప్ గెలవచ్చంటూ వ్యాఖ్య  
  • సన్ రైజర్స్ ఎంతో మెరుగుపడిందని కితాబు 
  • చెప్పినట్టుగా కొత్త జట్టుకే టైటిల్ రావచ్చన్న శాస్త్రి  
ఐపీఎల్ సీజన్ లో సగం మ్యాచ్ లు ముగిశాయి. టాప్ 5లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ రేసులో నిలిచే జట్లపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తన అంచనాలను వెల్లడించారు. 

సీజన్ ను వరుస రెంటు ఓటములతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఆ తర్వాత ఓటమి అన్నదే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. టోర్నమెంట్ ఆరంభమైన తర్వాత ఎంతో బలంగా తయారైన జట్టు ఇదేనని రవిశాస్త్రి అన్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మంచి ప్రదర్శన చేస్తున్నట్టు చెప్పారు. తనకున్న ఆటగాళ్ల వనరుల పట్ల అతడు ఎంతో నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో అతడు కోరుకున్నట్టుగా జట్టును నడిపించగలుగుతున్నాడని విశ్లేషించారు.

ఆటతీరును పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ కూడా టైటిల్ ను గెలుచుకునే అవకాశాలున్నట్టు రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘‘కొత్త జట్టు టైటిల్ గెలుస్తుందని ఆరంభంలోనే చెప్పాను. లక్నో, గుజరాత్, ఆర్సీబీ.. వీటితోపాటు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు వెళతాయి. రాజస్థాన్ కు షేన్ వార్న్ మొదటి టైటిల్ తెచ్చి పెట్టాడు. ఈ ఏడాది అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ సభ్యులు ఆడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే టైటిల్ ఖాయం’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. గుండెపోటుతో ఇటీవలే షేన్ వార్న్ మరణించడం తెలిసిందే.
Ravi Shastri
IPL crown
teams

More Telugu News