Hyderabad: నా పూర్వజన్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నానంటూ అదృశ్యమైన బాలుడు!

Boy Missing in Hyderabad for searching for past birth parents
  • హైదరాబాద్‌లోని న్యూ విద్యానగర్‌లో ఘటన
  • మీరు నా తల్లిదండ్రులు కారంటూ సెల్ఫీ వీడియో
  • బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు
నిండా 13 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు తన గత జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌లోని న్యూ విద్యానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదృశ్యమైన బాలుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే దంపతులకు 15, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. విభేదాల కారణంగా భర్త వేరుగా ఉంటున్నాడు. పిల్లలు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1న చిన్న కుమారుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. 

అతడి కోసం కంగారుపడుతున్న సమయంలో ఫోన్‌లో బాలుడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటపడింది. అందులో .. ‘‘మీరు నా తల్లిదండ్రులు కారు. నా పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నా’’ అని ఉండడంతో హతాశులయ్యారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
New Vidyanagar
Boy
Missing

More Telugu News