తెలంగాణలో కనిష్ఠ స్థాయిలో కరోనా వ్యాప్తి

తెలంగాణలో గడచిన ఒక్కరోజు వ్యవధిలో 15,633 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,91,857 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,508 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 238 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.


More Telugu News