YSRCP: వైసీపీలో విజ‌య‌సాయిరెడ్డికి అద‌న‌పు బాధ్య‌త‌లు.. స‌జ్జ‌ల‌కు కూడా

new Responsibilities to sai reddy and sajjala
  • రీజ‌న‌ల్‌, జిల్లా అధ్య‌క్షుల కో ఆర్డినేట‌ర్‌గా సాయిరెడ్డి
  • ఇదివ‌ర‌కే అనుబంధ సంఘాల కో ఆర్డినేట‌ర్‌గానూ ఎంపీ
  • స‌జ్జ‌ల‌కు ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌లు
ఏపీలో అధికార పార్టీలో ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆ పార్టీ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డికి రీజ‌న‌ల్‌, జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేట‌ర్‌గా ఇదివ‌ర‌కే సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.
YSRCP
Vijay Sai Reddy
Sajjala Ramakrishna Reddy

More Telugu News