TSRTC: టీఎస్సార్టీసీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు.. 5 శాతం డీఏ ప్ర‌కటించిన స‌ర్కారు

  • ఉద్యోగులందరికీ 5 శాతం డీఏ
  • వ‌చ్చే నెల వేత‌నాల‌తో క‌లిపి చెల్లింపు
  • డీఏ చెల్లింపుతో సంస్థ‌పై నెల‌కు రూ.5 కోట్ల భారం
tsrtc announces 5 percent da to employees

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్సార్టీసీ) ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం నాడు తీసి క‌బురు చెప్పింది. వ‌చ్చే నెల నుంచి ఉద్యోగుల‌కు వేత‌నాల‌కు అద‌నంగా 5 శాతం డీఏ క‌లిపి చెల్లించ‌నున్న‌ట్లు టీఎస్సార్టీసీ ప్ర‌క‌టించింది. మూల వేత‌నంపై 5 శాతం డీఏను చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్టీసీ... దీనితో సంస్థ‌పై నెల‌కు రూ.5 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

మూల వేత‌నంపై ఉద్యోగులందరికీ 5 శాతం డీఏ చెల్లించ‌నుండ‌గా...  డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.600 నుంచి గరిష్ఠంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంద‌ని తెలిపింది.

More Telugu News