Anchor: నా భర్తతో ఎన్నో సార్లు గొడవలు జరిగాయి: యాంకర్ సుమ

Anchor Suma gives clarity on disputes with husband Rajeev Kanakala

  • ఈ 23 ఏళ్ల కాలంలో రాజీవ్ కు, తనకు మధ్య ఎన్నో సార్లు గొడవలు జరిగాయన్న సుమ 
  • భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులువని వ్యాఖ్య 
  • తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం మాత్రం కష్టమన్న సుమ 

తెలుగు వినోద పరిశ్రమలో యాంకర్ సుమ తనదైన ముద్ర వేసింది. బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూనే, సినిమా ఈవెంట్లలో వ్యాఖ్యాతగా అలరిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన 'జయమ్మ పంచాయతీ' చిత్రం మే 6న విడుదల కాబోతోంది. 

మరోవైపు సుమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. తన భర్త రాజీవ్ తో ఆమెకు విభేదాలు ఉన్నాయని, విడిపోవాలనుకున్నారనే కథనాలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా ఓ టీవీ షోలో ఆమె స్పందించింది. 

తనకు, రాజీవ్ కు మధ్య ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నో సార్లు గొడవలు జరిగాయని చెప్పింది. అయితే, భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులువని... తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం మాత్రం చాలా కష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెపుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. 

ఇక తనకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని... అయితే, ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆగానని తెలిపింది. చివరకు 'జయమ్మ పంచాయతీ' సినిమా వచ్చిందని చెప్పింది.

Anchor
Suma
Rajeev Kanakala
Husband
Disputes
  • Loading...

More Telugu News