గిన్నిస్ రికార్డుకెక్కిన 119 ఏళ్ల కానే టనాకా కన్నుమూత
- 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా రికార్డు
- అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న జపాన్ వ్యక్తిగా రికార్డు సొంతం
- రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన ఏడాదే జననం
- కానే మరణంతో రికార్డుల్లోకి ఫ్రాన్స్ మహిళ
సోడా, చాక్లెట్‌తోపాటు రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తాను సుదీర్ఘంగా బతకడానికి కారణమని కానే చెప్పేవారు. ఆమె మృతితో ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన లుసిలీ రాండన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా నిలిచారు. ఆమె వయసు ప్రస్తుతం 118 సంవత్సరాల 73 రోజులు. కాగా, 1903వ సంవత్సరం జనవరి రెండో తేదీన కానే జన్మించారు. అదే ఏడాది రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆమెకు నలుగురు సంతానం కాగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. ఆమె భర్త 1937లో చైనా-జపాన్ యుద్ధంలో పాల్గొన్నారు.