వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ విచారించబోనన్న హైకోర్టు జడ్జి
- బెయిల్ కోరుతూ వివేకా హత్య కేసు నిందితుల పిటిషన్
- జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్‌కు పిటిషన్
- వేరే బెంచ్‌కు పంపాలంటూ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ఆదేశం
వివేకా హత్య కేసులో అరెస్టయిన సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలు తమకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వీరి పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్‌కు రిఫర్ చేసింది. ఈ పిటిషన్ సోమవారం నాడు తన బెంచ్ మీదకు రాగానే.. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ఈ పిటిషన్‌ను తాను విచారించబోనని తేల్చి చెప్పారు. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు పంపాలని ఆయన హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.