మొహానికి మేకప్ వేసుకొచ్చి ఆసుపత్రిలో అబద్ధాలు చెప్పారు: వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు

  • విజయవాడలో అత్యాచారం జరిగిన మూడు రోజుల తర్వాత పరామర్శకు వచ్చారన్న ఉమ 
  • ఆమె ఒరేయ్ అంటే.. తాము ఒసేయ్ అనలేమా? అంటూ వ్యాఖ్య 
  • రాజకీయ కక్షతోనే మాకు నోటీసులు ఇచ్చారన్న ఉమ 
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ పై వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. 

దారుణం జరిగిన మూడు రోజుల తర్వాత వాసిరెడ్డి పద్మ పరామర్శకు వచ్చారని దుయ్యబట్టారు. మొహానికి మేకప్ వేసుకొచ్చి ఆసుపత్రిలో అబద్ధాలు చెప్పారని అన్నారు. ఆమె ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె ఒరేయ్ అంటే.. తాము ఒసేయ్ అనలేమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారని అన్నారు.  

కేవలం రాజకీయ కక్షతోనే తమకు నోటీసులిచ్చారని అన్నారు. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు తాము స్పందించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించేంత వరకు తాము న్యాయపోరాటం చేస్తామని అన్నారు. బాధితులకు అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

Bonda Uma
Chandrababu
Telugudesam
Vasireddy Padma
YSRCP

More Telugu News