Lata Mangeshkar: సోదరి లతా మంగేష్కర్ కు గాత్రంతో నివాళి అర్పించిన ఆశాభోంస్లే

Asha Bhosle pays melodious tribute to sister Lata Mangeshkar
  • ప్రధాని మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
  • ముంబైలో జరిగిన కార్యక్రమం
  • ఆయేగా ఆనేవాలా గీతాన్ని ఆలపించిన భోంస్లే
లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డును మొదటిగా ప్రధాని మోదీ స్వీకరించారు. లతాను తన పెద్ద సోదరిగా మోదీ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమంలో.. లతా మంగేష్కర్ కు ఆమె సోదరి ఆశాభోంస్లే ఘనంగా నివాళి అర్పించారు. 

‘ఆయేగా ఆనేవాలా’ పేరుతో లతా ఒకప్పుడు ఆలపించిన మధుర గీతాన్ని ఆశాభోంస్లే తన స్వరాన అంతే మధురంగా ఆలపించారు. ప్రధాని మోదీ సహా సభకు హాజరైన వారు ఆసక్తిగా వీక్షించారు. లతా మంగేష్కర్ స్వరం 80 ఏళ్లకు పైగా.. గ్రామఫోన్ నుంచి సీడీ, డీవీడీ, పెన్ డ్రైవ్, డిజిటల్ మ్యూజిక్ యాప్ ల వరకు ఎన్నో తరాలను పరవశింపజేసినట్టు ప్రధానిమోదీ ఈ సందర్భంగా కొనియాడారు. 
Lata Mangeshkar
Asha Bhosle
melodious tribute
PM Modi

More Telugu News