Somu Veerraju: టీచ‌ర్ల‌కు సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా?: సోము వీర్రాజు

  • సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వీర్రాజు డిమాండ్ 
  • మే7వ తేదీతో ఫైనల్ ప‌రీక్ష‌లు అయిపోతున్నాయ‌న్న నేత‌
  • ఈ దశలో వాల్యుయేషన్ డ్యూటీ లో ఉపాధ్యాయులు ఉంటార‌ని వ్యాఖ్య‌
  • ఆర్జిత సెల‌వులు ఇవ్వాలన్న ఉద్దేశంతో డొంక తిరుగుడుగా వ్యవహార‌మ‌న్న వీర్రాజు
somu veerraju slams   ycp

ఏపీలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటించిన‌ప్ప‌టికీ ఉపాధ్యాయులకు మాత్రం మే 20 వరకు సెలవులు ఉండ‌బోవ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మే7వ తేదీతో ఫైనల్ ప‌రీక్ష‌లు అయిపోతున్న దశలో వాల్యుయేషన్ డ్యూటీ లో ఉండే ఉపాధ్యాయులకు ఆర్జిత సెల‌వులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. 

  • Loading...

More Telugu News