మళ్లీ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కే ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం.. మిత్రుడికి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
- అధ్యక్ష ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు
- ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన మెక్రాన్
- సవరణలు తీసుకురావాలని అనుకుంటున్నట్టు ప్రకటన
ఆదివారం రాత్రి వరకు 97 శాతం ఓట్లను లెక్కించగా ఇమ్మాన్యుయేల్ కు 57.4 శాతం ఓట్లు లభించాయి. చాలా మంది ప్రజలు లీపెన్ ను అధికారానికి దూరంగా ఉంచాలనే తనకు ఓటు వేసిన వేసినట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘దేశంలో చాలా మంది నాకు ఓటు వేశారు. అంటే నా ఆలోచనలకు వారు మద్దతు పలికినట్టు కాదు. అతివాదులను దూరంగా ఉంచాలనే అలా వ్యవహరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఫ్రాన్స్ లో ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపించం’’ అంటూ ఇమ్మాన్యుయేల్ ప్రకటన చేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి మెక్రాన్ ఎన్నిక కావడం పట్ల భారత ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘నా స్నేహతుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడం పట్ల అభినందనలు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలసి పనిచేయాలని అనుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.