Bandi Sanjay: ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు: బండి సంజ‌య్

bandi sanjay slams trs
  • 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామన్నారు
  • తెలంగాణ‌లో చిన్న రోడ్లకు కూడా ప్ర‌భుత్వం మరమ్మతులు చేయలేకపోతున్నారు
  • కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది
తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేటలో ఆయ‌న మాట్లాడుతూ... మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ‌లో చిన్న రోడ్లకు కూడా ప్ర‌భుత్వం మరమ్మతులు చేయలేకపోతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. 

తెలంగాణ‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఆ నిధుల‌ను వాడుతూ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆయ‌న అన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చిన కేసీఆర్‌ అన్నింటినీ మర్చిపోయార‌ని, ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు మాత్ర‌మే పదవులు కట్టబెట్టారని చెప్పారు. అలాగే, ఆరు నెలల్లో ఆర్‌డీఎస్‌ పూర్తి చేస్తామని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిందని, అయిన‌ప్ప‌టికీ ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాలయాపన చేసిందని అన్నారు.
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News