Sunitha: తల్లి కాబోతుందున్న వార్తలపై సింగర్ సునీత ఏమన్నదంటే...!

Singer Sunitha reacts to rumors
  • మామిడిచెట్టు పక్కన సునీత
  • ఫోటో వైరల్
  • మీకో దండంరా నాయనా అంటూ స్పందన
  • పుకార్లు ప్రచారం చేయొద్దని హితవు
ప్రముఖ గాయని సునీత డిజిటల్ మీడియా వ్యాపార దిగ్గజం రామ్ వీరపనేనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే, సునీత సోషల్ మీడియాలో ఓ మామిడి చెట్టు వద్ద దిగిన ఫొటోపై అనేక వార్తలు ప్రసారం అయ్యాయి. సునీత తల్లికాబోతోందా? అందుకే మామిడిచెట్టు వద్ద తీయించుకున్న ఫొటో పంచుకుందా? అంటూ కథనాలు బయల్దేరాయి. 

దీనిపై సునీత స్పందించారు. "మీకో దండంరా నాయనా... జనాలు ఇంత క్రేజీగా ఉంటారా... మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫొటో దిగాను. దాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తారా? ఊహాజనిత కథనాలు, రూమర్లను వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి" అంటూ సునీత హితవు పలికారు.
Sunitha
Singer
Motherhood
Mango Tree
Rumors
Tollywood

More Telugu News