Chhattisgarh: స్కూల్‌లోనే టీచర్‌తో హెడ్మాస్టర్ కామకేళి..వీడియో వైరల్, ఊడిన ఉద్యోగం

Headmaster suspended for having sex with teacher in govt school building
  • చత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో ఘటన
  • స్కూలు స్టోర్ రూమును తమ శృంగారానికి ఉపయోగించుకుంటున్న ప్రిన్సిపాల్
  • రహస్యంగా పట్టుకున్న గ్రామస్థులు
 సరస్వతీ నిలయమైన ఓ ప్రభుత్వ పాఠశాల ఓ టీచర్, ప్రిన్సిపాల్ కామకేళికి కేంద్రంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్ర చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్టోర్‌రూమును తమ శృంగార కార్యకలపాలకు రహస్య స్థలంగా మార్చుకున్న ప్రిన్సిపాల్, టీచర్‌ను గ్రామస్థులు పట్టుకున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విచారణ జరిపించి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులిద్దరూ కామకేళిలో మునిగి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. వారిద్దరిపై ఇదివరకే అనుమానం ఉన్న గ్రామస్థులు ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

కాగా, ఈ వీడియోను ఇంటర్నెట్, సోషల్ మీడియాలో లీక్ చేయకుండా ఉండేందుకు గుర్తు తెలియని వ్యక్తికి లంచం ఇచ్చేందుకు సద్ధమైన ప్రిన్సిపాల్ ఆడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. అయితే, అప్పటికే గ్రామస్థులు కలెక్టర్ చందన్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను కాంకెర్ జిల్లా, ఇంద్రప్రస్థ గ్రామంలోని పీవీ 39 హైస్కూల్‌లో పనిచేస్తున్న రాజేశ్ పాల్‌గా గుర్తించారు.
Chhattisgarh
Govt School
Principal
Romance

More Telugu News