Jeevitha: మాకు సమన్లు వచ్చిన విషయం నిజమే.. కానీ, నేను అరెస్ట్‌ కాలేదు: జీవితా రాజ‌శేఖ‌ర్

  • ఏడాదికి పైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తోందన్న జీవిత‌
  • వారు మీడియా ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థం కావ‌ట్లేదని వ్యాఖ్య‌ 
  • ఇంతకు ముందు కూడా తనపై వారెంట్‌ వచ్చిందని వివ‌ర‌ణ‌
  • త‌మ‌పై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిపాటు
Jeevitha on Cheating Case

సినీ న‌టులు జీవిత, రాజశేఖర్ దంపతులు ఓ సినిమా కోసం రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై ఈ రోజు జీవిత‌ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... తనకు సమన్లు వచ్చిన విషయం నిజమేన‌ని.. కానీ, తాను అరెస్ట్‌ కాలేదని చెప్పారు. ఏడాదికి పైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తోందని తెలిపారు. ఇంత కాలంగా ఈ కేసులు న‌డుస్తుంటే వారు మీడియా ముందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థం కావ‌ట్లేద‌ని చెప్పారు. 

ఇంతకు ముందు కూడా త‌న‌కు మ‌రో కేసులో వారెంట్‌ వచ్చిందని, అయితే ఆ కేసులో తానే గెలిచినట్లు తెలిపారు. తాము రూ.26 కోట్ల మోసానికి పాల్ప‌డ్డామ‌ని త‌మ‌పై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్‌రావు అంటున్నారని, అయితే, అవి ఏ కోట్లో అర్థం కావడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. త‌మ‌పై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోటేశ్వర‌రావు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని ఆమె తెలిపారు.

More Telugu News