శంకర్ ప్రాజెక్టులో పెద్ద ట్విస్టు ఇదే!

  • షూటింగు దశలో శంకర్
  • పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ డ్రామా 
  • సంగీత దర్శకుడిగా తమన్
  • దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ సినిమా
శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. రాజకీయాల నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ సినిమా ఇది. దిల్ రాజు తన 50వ సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వానీ అలరించనుంది.

'వినయ విధేయ రామ' తరువాత చరణ్ జోడీగా కియారా చేస్తున్న సినిమా ఇది. ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ తోను, మరో వైపున 'ఆచార్య' పనులతోను చరణ్ బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా శంకర్ తన సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ ను చక్కబెడుతూనే వచ్చాడు.

అలా ఇప్పటికే ఈ సినిమా 4 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సినిమాటోగ్రాఫర్ 'తిరు' తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. అమృత్ సర్ షెడ్యూల్ కి ఆయన రాలేదట. ఆయన ప్లేస్ లో రత్నవేలు వచ్చినట్టుగా సమాచారం. మరి మిగతా షెడ్యూల్స్ కి కూడా రత్నవేలునే కొనసాగుతాడా? లేదా? అనేది చూడాలి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


More Telugu News

Ramcharan Kiara Adwani Shankar Movie